కేసీఆర్‌కు ఓపెన్ ఛాలెంజ్ | రాష్ట్ర అప్పులపై భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు | Full Speech
Leírás
అబద్దాల పునాదుల మీద ఆర్థిక వ్యవస్థను నిర్మించలేం
అబద్ధాల ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు.. వాస్తవాలపై చర్చకు రండి: మీడియా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
* పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని రూ.8.21 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టారు
* రెండున్నరేళ్లలో గత ప్రభుత్వ అప్పులకు రూ.2.08 లక్షల కోట్లు అసలు, వడ్డీ చెల్లించాం
* డెట్ రీస్ట్రక్చరింగ్‌తో రాష్ట్రానికి రూ.22,142 కోట్ల భారం తగ్గించాం
* సింగరేణిపై అసత్య ప్రచారం ఆపాలి.. బొగ్గు మాయమైందన్న ఆరోపణలపై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు
* సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం చారిత్రాత్మక సంస్కరణలు చేపట్టింది
అబద్ధాలను ప్రచార అస్త్రాలుగా మార్చుకుని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం ఇకపై సహించబోదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
శుక్రవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ...,
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బీఆర్ఎస్ నాయకులు హరీష్‌రావు, కేటీఆర్ చేస్తున్న విమర్శలు పూర్తిగా అసత్యాలు.పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అడ్డగోలుగా అప్పులు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రజా ప్రభుత్వం క్రమశిక్షణతో పనిచేస్తుంటే, ప్రతిపక్షాలు అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు.
ప్రతిపక్షాలు గోబెల్స్ తరహా ప్రచారానికి పాల్పడుతున్నాయి, రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినకూడదనే ఉద్దేశంతో ఇప్పటివరకు సంయమనం పాటించాం, అయితే నిరంతరం సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న విషప్రచారానికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
హరీష్‌రావు, కేటీఆర్ ఒకవైపు ప్రభుత్వానికి సవాళ్లు విసురుతూ, మరోవైపు మళ్లీ కేసీఆరే అధికారంలోకి వస్తారని చెబుతున్నారు, అలాంటప్పుడు వారి రాజకీయ పాత్ర ఏమిటో ప్రజలకు చెప్పాలి. అబద్ధాలను పోగేసి ప్రచారం చేయడం తప్ప ప్రజలకు చెప్పేందుకు బీఆర్ఎస్ వద్ద ఏమీ లేదన్నారు.
రూ.8.21 లక్షల కోట్ల అప్పులకు కేసీఆర్ సమాధానం చెప్పాలి...
2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం రుణాలు, ప్రభుత్వ గ్యారంటీతో కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పులు, ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, డిస్కంల బకాయిలు తదితరాలను కలిపి మొత్తం రూ.8,21,651 కోట్ల ఆర్థిక భారాన్ని రాష్ట్రంపై మోపిందని వెల్లడించారు. ఈ అప్పులన్నింటికీ బీఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
పదేళ్ళ పాలన.. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో విధ్వంసం చేసింది. అబద్దాల పునాదుల మీద ఆర్థిక వ్యవస్థను నిర్మించలేం.
కేసీఆర్ కు ఛాలెంజ్ చేస్తున్నా..అప్పులు చేసి ప్రజలపై భారం వేసింది నిజం కాదా??
రూ.8,21,651 కోట్లు అప్పు చేసింది మీరు కాదా?
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులను హరీష్ రావు, కేటీఆర్ తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా అప్పులపై శ్వేతపత్రం విడుదల చేశామని గుర్తు చేశారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించి కేవలం రెండున్నరేళ్లలోనే రూ.2,08,681 కోట్లను అసలు, వడ్డీల రూపంలో చెల్లించామని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు రూ.3 లక్షల కోట్లే అప్పు చేశామని చెబితే, రిజర్వ్ బ్యాంక్ ద్వారా చెల్లించిన ఈ భారీ మొత్తం దేనికో ప్రజలకు వివరించాలని సవాల్ విసిరారు.
రీ-స్ట్రక్చరింగ్‌తో రూ.22 వేల కోట్లకు పైగా ప్రజాధనం ఆదా చేశాం...
బీఆర్ఎస్ ప్రభుత్వం 10 నుంచి 10.5 శాతం వరకు అధిక వడ్డీ రేట్లతో కార్పొరేట్ బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి రాష్ట్రంపై పెనుభారం మోపిందన్నారు. ప్రజా ప్రభుత్వం బాధ్యతాయుతంగా డెట్ రీస్ట్రక్చరింగ్ చేపట్టి, 2025-26 నుంచి 2031-32 మధ్య చెల్లించాల్సిన రూ.34,058 కోట్ల రుణభారాన్ని రూ.11,915 కోట్లకు తగ్గించిందన్నారు. దీనివల్ల రాష్ట్రానికి రూ.22,142 కోట్ల మేర ఆదా జరిగిందన్నారు.
గత ప్రభుత్వం కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న అప్పులను రాష్ట్ర అప్పులుగా చూపకుండా ప్రజలను తప్పుదోవ పట్టించిందన్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ వంటి ప్రాజెక్టుల కోసం తీసుకున్న రుణాల భారాన్ని నేడు ప్రజా ప్రభుత్వమే భరిస్తోందన్నారు.
అయితే ఆర్థిక క్రమశిక్షణతోనే ఉద్యోగులకు సకాలంలో జీతాలు, రైతు భరోసా సహా అన్ని సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.
సింగరేణిపై దుష్ప్రచారం మానుకోవాలి....
సింగరేణి సంస్థపై బీఆర్ఎస్ చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. పదేళ్ల పాలనలో సింగరేణికి ఒక్క కొత్త కోల్ బ్లాక్ కూడా తీసుకురాలేదని, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అవసరమైన బొగ్గు గనులను ఎందుకు సమకూర్చలేదని ప్రశ్నించారు.
కోయగూడెం, సత్తుపల్లి-3 వంటి విలువైన బొగ్గు బ్లాకులను సింగరేణికి దక్కకుండా చేసి ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టిందీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. దీనివల్ల సింగరేణి బలహీనపడటంతో పాటు రాష్ట్రానికి భారీ నష్టం జరిగిందన్నారు.
సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందన్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని స్పష్టం చేశారు. అత్యాధునిక జియో ఫెన్సింగ్ వ్యవస్థతో పనిచేస్తున్న సింగరేణిలో ఒక్క కిలో బొగ్గు కూడా అక్రమంగా బయటకు వెళ్లే అవకాశం లేదన్నారు.
అయితే ప్రతిపక్షాల ఆరోపణలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని, పూర్తి స్థాయి విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచేందుకు సింగరేణి విజిలెన్స్ డైరెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.
https://www.facebook.com/share/p/19CG7cbYYa/
కేసీఆర్‌కు ఓపెన్ ఛాలెంజ్ | రాష్ట్ర అప్పులపై భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు | Full Speech – Online videóklip leírása
Nézd meg a(z) కేసీఆర్‌కు ఓపెన్ ఛాలెంజ్ | రాష్ట్ర అప్పులపై భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు | Full Speech című zenei videót kiváló minőségben online a videok.top-on! Hallgasd meg a legújabb slágereket és kövesd kedvenc előadóid hivatalos videóklipjeit regisztráció nélkül. Böngéssz a zenei kategóriák között, és fedezd fel a legfrissebb hazai és nemzetközi újdonságokat, koncerteket és dalokat nálunk.
Zenei poén betöltése...

























