నువ్వు పోలేపల్లి భూ సమస్యల గురించి పార్టీ మారుతున్న నాకు లక్ష్మారెడ్డి ఎలాంటి అన్యాయం చేయలేదని కానీ
Leírás
రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి పై బాదేపల్లి సింగిల్ విండో చైర్మన్ సుదర్శన్ గౌడ్ అవాకులు చవాకులు మాట్లాడితే సహించేది లేదని బిఆర్ఎస్ పార్టీ ఉద్యమ సీనియర్ నాయకుడు మాజీ మూడ డైరెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ఖాన్ అన్నారు, శుక్రవారం జడ్చర్ల పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ కళాభవన్ లో మాజీ సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్, సీనియర్ నాయకుడు శంకర్ నాయక్,పర్వత్ లాల్, శ్రీనివాస్ యాదవ్ తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఉద్యమ నాయకుడు మొదటిసారి తెలంగాణ రాష్ట్ర సాధనకు ఎమ్మెల్యే పదవిని రాజీనామా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పై సింగిల్ విండో చైర్మన్ సుదర్శన్ గౌడ్ అబద్ధపు ఆరోపణలు చేయడం తగదని మాజీ ముర డైరెక్టర్ సీనియర్ ఉద్యమ నాయకుడు ఇంతియాజ్ అహ్మద్ ఖాన్ హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీలో పబ్బం గడవకనే బిఆర్ఎస్ పార్టి మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి పై అబద్ధపు విమర్శలు చేస్తున్నాడని సింగిల్ విండో చైర్మన్ సుదర్శన్ గౌడ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో పేర్లు రావాలంటే మా నాయకత్వం విమర్శలు కాదు పని చేసి పేరు తెచ్చుకోవాలని లేదా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అది నీ ఇష్టం అని కానీ మా నాయకుడి పై విమర్శలు చేస్తే సహించేది లేదని ఘాటుగా స్పందించారు. నీకు నాకు బిఆర్ఎస్ పార్టీలో ఆనాటి టిఆర్ఎస్ పార్టీలో మూడు రోజులే తేడా అని గుర్తు చేశారు. మా కోడుగల్ గ్రామంలోని ఆనాడు టిఆర్ఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేసిన రోజులు మర్చిపోయావా అని మాజీ మూడ డైరెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ఖాన్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో లేని వ్యక్తి తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడం ఏంటని ప్రశ్నించారు. 2004లో పార్టీలో చేరిన సుదర్శన్ గౌడ్ తర్వాత పార్టీ కి 2008లో ఉప ఎన్నికల సమయంలో పార్టీలో పని చేయలేదని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ నాయకుడు అంటే తెలంగాణ సాధించే వరకు పనిచేసే నాయకుని ఉద్యమ నాయకుడు అంటారని కానీ నీలా అటు ఇటు ఉంది పనిచేయండి నాయకుడిని ఉద్యమ నాయకుడు అన్నారని అన్నారు, 2009లో కెసిఆర్ పాలమూరు ఎంపీగా పోటీ చేస్తే నువ్వు బీఎస్పీ అభ్యర్థిగా పాలమూరు ఎంపీగా పోటీ చేశావు అని అన్నారు. నీ స్థాయి లక్ష్మారెడ్డి గురించి మాట్లాడే స్థాయి కాదని ఆనాడు బిఆర్ఎస్ పార్టీ క్వార్టర్స్ కార్యాలయంలో నివాసం ఉన్నా నువ్వు ఆనాడు నీ ఆస్తి ఎంత ఉంది ఈనాడు నీ ఆస్తి ఎంత ఉంది లెక్క చేసుకోవాలని పేర్కొన్నారు. నీ వెంట నేను తిరిగిన మా వెంట నువ్వు తిరిగినవ్, కానీ నీకు సహాయం చేసిన లక్ష్మారెడ్డి వ్యక్తి అది మర్చిపోతావా అని మాజీ మూడ డైరెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ఖాన్ అన్నారు. సుదర్శన్ గౌడ్ నీ గురించి మొత్తం తెలుసు నువ్వు పోలేపల్లి భూ సమస్యల గురించి పార్టీ మారుతున్న నాకు లక్ష్మారెడ్డి ఎలాంటి అన్యాయం చేయలేదని కానీ నా వ్యక్తిగత కారణాల వల్ల తోక తప్పదని నా ముందల చెప్పిన విషయం గుర్తుపెట్టుకో అని పేర్కొన్నారు. ఆర్థికంగా బాగుపడ్డది కూడా లక్ష్మారెడ్డి దయ వల్లనే అని అన్నారు. నువ్వు అమెరికాలో ఉంటే నిన్ను పిలిచి మరి సింగిల్ విండో చైర్మన్ చేసింది లక్ష్మారెడ్డి కాద చేప్పాలని అన్నారు. ఆవంచ గ్రామ సర్పంచిగా తిమ్మాజిపేట సింగిల్ విండో చైర్మన్ గా తెలుగు యువత అధ్యక్షుడిగా గ్రంధాలయ చైర్మెన్ గా పని చేసిన వ్యక్తి లక్ష్మారెడ్డి అని ఆ పదవులని నువ్వు ఇప్పించావా అని అడిగారు అలాగే ఆనాడు అన్ని పదవులు అనుభవించిన లక్ష్మారెడ్డి మరి నువ్వు కనీసం వార్డ్ నెంబర్ గా ఉన్నావ్ అని ఇంతియాజ్ అహ్మద్ ఖాన్ గుర్తు చేశారు. లక్ష్మారెడ్డి భయపడ్డాడు అని చెప్పడం హాస్యాస్పదమని ఇండిపెండెంట్ ఆనాడు పోటీ చేసిన లక్ష్మారెడ్డి 20 వేల ఓట్లు వేశారని ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబునాయుడు జడ్చర్ల డిగ్రీ కళాశాల లో జరిగిన బహిరంగ సభలో లక్ష్మారెడ్డి మీలాంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలో పని చేయాలని మీరు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీని విరమించుకోవాలని కోరినా కూడా లక్ష్మారెడ్డి ఉద్యమం కోసం పనిచేశారని గుర్తు చేశారు. భయపడే వ్యక్తి అయితే ఎమ్మెల్యేగా మంత్రిగా ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే పదవిని త్యాగం చేశాడని పేర్కొన్నారు. మా లక్ష్మారెడ్డి భిక్షతో వచ్చిన పదవి సింగిల్ విండో చైర్మన్ కు రాజీనామా చేయాలని నువ్వు
ఓట్లతో గెలిచిన వ్యక్తివి కాదని ఆనాడు గోపాల్ రెడ్డి ని తీసుకొచ్చి ఒప్పించి అభ్యర్థిగా ఉపసంహరించాలని కోరితే నువ్వు సింగిల్ విండో గెలిచినవ్వు అని అన్నారు. శ్వేతా లక్ష్మారెడ్డి అనారోగ్య కారణాల వల్ల బెంగుళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే మనందరం కలిసి పోదామని చెప్పావు మర్చిపోయావా అలాంటప్పుడు లక్ష్మారెడ్డి భార్యని ఎలా పట్టించుకోడు అని ప్రశ్నించారు అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు లక్ష్మారెడ్డి తో జాగ్రత్తగా ఉండాలని మాట్లాడడం సమంజసం కాదని నీతోటి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని నీవల్ల ఎవడైనా బాగుపడ్డ వ్యక్తి ఉంటే ప్రజలకు చూపించాలని కోరారు. టిడిపి టిఆర్ఎస్ కాంగ్రెస్ బిఎస్పి నాలుగు పార్టీలు మారి మళ్ళీ కాంగ్రెస్తో చేరిన వ్యక్తివి నువ్వు నీ వల్ల కాంగ్రెస్ కేడర్ జాగ్రత్తగా ఉండాలి అని ఇంతియాజ్ అహ్మద్ ఖాన్ అన్నారు. మేము తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బిఆర్ఎస్ పార్టీని నమ్ముకుని పని చేశాం నీలాగా పార్టీలు మారలేదని పేర్కొన్నారు. పార్టీలకతీతంగా కలిసిమెలిసి పనిచేసే వాతావరణం జడ్చర్ల లో ఉందని అలాంటి వాతావరణంలో చిచ్చుపెట్టే వ్యక్తివి నువ్వు అని అన్నారు. అదేవిధంగా ఉద్యమ నాయకుడు బుర్గుపల్లి విజయ్ కుమార్ ఆనంద్ గురించి నువ్వు మాట్లాడడం సమంజసం కాదని బురుగుపల్లి విజయకుమార్ ఉద్యమం చేసిన నాయకుడు అతనికి మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఏం చేయాలో చేశారు మీరు కూడా లబ్ధి పొందిన వ్యక్తి సుదర్శన్ గౌడ్ అదేవిధంగా నర్సింహులు ఆనందకు ఎలాంటి సహాయం చేయను మాజీ మంత్రి తరఫున చేశాడు కానీ మీలా చిచ్చుపెట్టి రాజకీయాలు చేయడం ఎవరికి రాదని మాజీ మూడ డైరెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ఖాన్ పేర్కొన్నారు. ఇకనైనా మాజీ మంత్రిపై ఆరోపణలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. సీనియర్ నాయకుడు శంకర్ నాయక్ మాట్లాడుతూ మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పై సుదర్శన్ గౌడ్ అవాకులు చవాకులు మాట్లాడితే నాలుక చీరేస్తామని.
నువ్వు పోలేపల్లి భూ సమస్యల గురించి పార్టీ మారుతున్న నాకు లక్ష్మారెడ్డి ఎలాంటి అన్యాయం చేయలేదని కానీ – Online videóklip leírása
Nálunk a zene sosem áll meg! Hallgasd meg a(z) నువ్వు పోలేపల్లి భూ సమస్యల గురించి పార్టీ మారుతున్న నాకు లక్ష్మారెడ్డి ఎలాంటి అన్యాయం చేయలేదని కానీ című slágert, amely most frissen került be a rendszerünkbe. Oszd meg a zenei élményt ismerőseiddel is, gyűjts inspirációt, vagy válogass a kapcsolódó kategóriák és címkék gazdag kínálatából.





























![Naji Osta - Chou Kan Baddi [Official Music Video] (2019) / ناجي الاسطا - شو كان بدي](https://i.ytimg.com/vi/c3WS20Baqcg/hqdefault.jpg)






































































![Phora, Ecko & Mariah - Te Necesito [Official Lyric Video]](https://i.ytimg.com/vi/45GIHRtXQk8/hqdefault.jpg)







































![veszélyes coronita mix 2020 [DJ Renáto]](https://i.ytimg.com/vi/3iCRPFs95mw/hqdefault.jpg)





















































