జగన్ మూడు రాజధానులు అని మాడు పగలు కొట్టుకున్నాడు.
Leírás
*వైసీపీ నేతలకు బండి రామకృష్ణ హెచ్చరిక*
• మూడు రాజధానులు అని ఎన్నికలకు వెళ్తే మాడు పగలగొట్టి ఇంట్లో
కూర్చోపెట్టారు. అప్పటికైనా పిచ్చి కుదురుతుందేమో అనుకున్నారు. మాత్రల డోసు పెంచే కొద్దీ పిచ్చి ముదురుతోంది. గన్స్, గొడ్డళ్ళు అనే మోజు ఎక్కువై రాజధానిగా మావిగన్ అంటున్నాడని బండి రామకృష్ణ విమర్శించారు
పైగా మావిగన్ తోనే ఎన్నికలకు వెళ్తాను అంటున్న జగన్ ఈ సారి 11 నుంచి 1కి పడిపోతాడని 2029 ఎన్నికల వరకూ అవసరం లేదు... రాబోయే స్థానిక ఎన్నికల్లోనే వైసీపీ అడ్రస్ లేకుండా ఓడించాలని అన్నారు
రాష్ట్రంలో రాజధాని అభివృద్ధికి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నారని పనులు వేగంగా
సాగుతున్నాయి. అవి చూసి కడుపు మంటతో రాజధానిలో గొడవలు పెడుతున్నారని అన్నారు వైసీపీ నాయకులు కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికే సిద్ధపడి ఉన్నారని వాళ్ళ కుట్రలను ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు అర్థమయ్యేలా చెబుతున్నారు. కాబట్టే ఆయన్ని లక్ష్యంగా చేసుకొని ఇష్టానుసారం వైసీపీ నాయకులు, పెయిడ్
ఆర్టిస్టులుమాట్లాడుతున్నారని విరుచుకు పడ్డారు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చట్ట ప్రకారం ముందుకు వెళ్తోంది. చట్టాన్ని అమలు చేయగానే గగ్గోలు పెట్టడం జగన్ కి అలవాటుగా మారింది.
మతాల మధ్య చిచ్చుపెట్టేలా మాట్లాడేవాళ్లని, మహిళల్నీ, ఆడబిడ్డలను కించపరచెలా వ్యాఖ్యలు చేసేవారిని కచ్చితంగా కట్టడి చేయాలనీ చట్ట ప్రకారం చర్యలుతప్పవని
ఎదుటివారిని కించపరచేలా బూతులు మాట్లాడుతూ, ఎదుటివారి ఇళ్ళలో స్త్రీలపై అభ్యంతరకర వ్యాఖలు చేస్తే నవ్వుకొనే పైశాచికత్వం జగన్ కే ఉంది. చంద్రబాబు గారి సతీమణిపై నిండు శాసన సభలో వైసీపీ వాళ్ళు ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తే నవ్వుతూ ప్రోత్సహించిన జగన్ ఈ రోజు చట్టం గురించి చెప్పడం విచిత్రంగా ఉంది.
• అతనికి మహిళలపై ఏ మాత్రం గౌరవం లేదు. తల్లిని ఇంట్లోంచి బయటకు గెంటేశాడు. చెల్లెలుకి ఆస్తి ఇవ్వకుండా మోసం
చేయడమే కాకుండా... తన పార్టీ వాళ్ళు, తన పార్టీ సోషల్ మీడియా కీచకులతో అసభ్యంగా మాట్లాడించిన వ్యక్తిత్వంలేని మనిషి జగన్
అన్నారు రూల్ ఆఫ్ లా ప్రకారం కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టే
సి.ఐ.నాగరాజునీ, పోలీస్ కానిస్టేబుల్స్ నీ అరెస్టు చేసింది.జగన్ ప్రభుత్వంలో ఏ రోజైనా రూల్ ఆఫ్ లా ఉందా? దళిత సామాజిక వర్గానికి చెంది డా.సుధాకర్ ను ఎంతగా వేధించారు... చివరకు అతను మానసిక క్షోభతో చనిపోయేలా చేసి ఈ రోజు రూల్ ఆఫ్ లా అంటున్నారు. రాజానగరం నియోజకవర్గంలో దళిత యువకుడు వరప్రసాద్ కి శిరోముండనం చేసింది వైసీపీ నాయకులు కాదా? ఆ రోజు ఎందుకు రూల్ ఆఫ్ లా గురించి మాట్లాడలేదు. వరప్రసాద్ విసిగిపోయి రాష్ట్రపతికి లేఖ రాశారు.... నేను నక్స లైట్లలో
చేరిపోతాను అని.
• జగన్ ప్రియ శిష్యుడు అనంతబాబు దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేస్తే – అప్పుడు చట్టం గుర్తుకురాలేదా?
అన్నారు వైసీపీలో మంత్రిగా ఉన్న విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ ఒక వాలంటీర్ ను హత్య చేస్తే ఎందుకు నోరు మెదపలేదు. వైసీపీ కార్యకర్త వేంకటేశ్వర రెడ్డి చేతిలో సజీవ దహనం అయిన అమరనాథ్ గౌడ్ కుటుంబం గురించి జగన్ ఎందుకు మాట్లాడడు. రూల్ ఆఫ్ లా, చట్టాన్ని గౌరవించేవాడివే అయితే – డా సుధాకర్ కుటుంబాన్ని, వీధి సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని, శ్రీకాంత్ చేతిలో చనిపోయిన వాలంటీర్ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదో జగన్ సమాధానం చెప్పాలి. అమరనాథ్ గౌడ్ కుటుంబానికి జగన్ సంజాయిషీ ఇచ్చుకోవాలి.
• జగన్ కేవలం నేరస్తుల ఇళ్లకే వెళ్తాడు. వాళ్ళకే అండగా ఉంటాడు. తెనాలిలో గంజాయి బ్యాచ్ ను పోలీసులు కట్టడి చేస్తే
ఆ గంజాయి బ్యాచ్ ఇంటికి వెళ్ళి పరామర్శించాడు. సాయికృష్ణ మీద 23 తీవ్రమైన కేసులు ఉన్నాయి. సాయికృష్ణ చేత, అతని స్నేహితుల చేత మానభంగానికి గురిఐన 14 ఏళ్ల బాలిక కోసం ఏమైనా ఆలోచించాడా?
సాయికృష్ణను మాత్రం పాపం పసివాడు... ఏదో రేపులు చేశాడు... గంజాయి స్మగ్లింగ్ చేశాడు... బీరు బాటిల్ తో పీక కోశాడు అని చెప్పడానికి సిగ్గు అనిపించడం లేదా.
అన్నారు
• జగన్ ఏమైనా గాంధీ మహాత్ముడా... హే రామ్ అంటూ డ్రామాలు చేస్తున్నాడు.
• జగన్ అనే వ్యక్తి స్పైడర్ సినిమాలో సైకో విలన్. అతనికి చావులు, చావు డప్పులే ఆనందాన్ని ఇస్తాయి. ఎక్కడ శవం ఉంటే అక్కడ వాలిపోయే సైకో మనిషి.
• గోదావరి జిల్లాలు అంటేనే ప్రశాంతతకు మారు పేరు. అక్కడ కావాలనే మతాల చిచ్చుపెడుతున్నాడు. జగన్ కుట్రలను ప్రజలు ఆదిలోనే తుంచేయాలి.
• కోనసీమలో కులాల కుంపటి రాజేసేందుకే అమలాపురం అల్లర్లు సృష్టించాడు. ప్రజలు ప్రజాస్వామ్య రీతిలో బుద్ది చెప్పారు. ఈసారి మతాల మధ్య గొడవలు పెట్టె కుట్ర మొదలుపెట్టాడు. ప్రజలు మేల్కొని బుద్ధి చెప్పాలి.
• వైసీపీ పాలనలో శ్రీరాముడి విగ్రహం తల నరికించినా... ఆలయాల రథాలు తగలపెట్టించినా, దేవతా విగ్రహాలను అపవిత్రం చేసినా జగన్ కళ్ళు చల్లబడలేదు. అందుకే పెయిడ్ ఆర్టిస్టులైన పేర్వేర్టెడ్ వ్యక్తులతో హిందూ దేవుళ్ళను, సనాతన ధర్మాన్ని కించపరచేలా ప్రసంగాలు చేయిస్తున్నారు.
• జగన్ రాక్షస
రావణాసురులను, కీచకులను జనం మీదకు వదులుతూనే ఉంటాడు. వాళ్ళను చట్టప్రకారం కట్టడి చేసే పనిలో కూటమి ప్రభుత్వం ఉందని బండి రామకృష్ణ అన్నారు
#jsp #kutami #rk #pavan #dycm #tdp #ysrcp #amdhra #trs #brs #bjp #congress
జగన్ మూడు రాజధానులు అని మాడు పగలు కొట్టుకున్నాడు. – Online videóklip leírása
Nézd meg a(z) జగన్ మూడు రాజధానులు అని మాడు పగలు కొట్టుకున్నాడు. című zenei videót kiváló minőségben online a videok.top-on! Hallgasd meg a legújabb slágereket és kövesd kedvenc előadóid hivatalos videóklipjeit regisztráció nélkül. Böngéssz a zenei kategóriák között, és fedezd fel a legfrissebb hazai és nemzetközi újdonságokat, koncerteket és dalokat nálunk.
Zenei poén betöltése...

























